LOADING...
Weather: నేటి నుంచి ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలెర్ట్ 
నేటి నుంచి ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలెర్ట్

Weather: నేటి నుంచి ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలెర్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అది మంగళవారం నాటికి అల్పపీడనంగా మారి, తరువాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వివరాలు 

వివరాల ప్రకారం.. 

అక్టోబర్ 20న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీవానలు కురిసే అవకాశం ఉంది. 21న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడవచ్చని అంచనా. 22న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవానలు కురవొచ్చని తెలిపింది. 23న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు, అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.