Loading...
Andhra Pradesh: సేవలు, మౌలిక వసతుల కల్పనలో ఏపీకి దేశంలో రెండో స్థానం
సేవలు, మౌలిక వసతుల కల్పనలో ఏపీకి దేశంలో రెండో స్థానం

Andhra Pradesh: సేవలు, మౌలిక వసతుల కల్పనలో ఏపీకి దేశంలో రెండో స్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవలు, మౌలిక వసతులు కల్పించడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు.. సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తలసరి ఆదాయంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలకు అందిస్తున్న సేవలు, సౌకర్యాల విషయంలో మెరుగైన పనితీరు కనబరిచింది. ఓపీ జిందాల్‌ విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ న్యూ ఎకనమిక్‌ స్టడీస్‌ విభాగం రూపొందించిన యాక్సెస్‌ (ఇన్‌)ఈక్వాలిటీ ఇండెక్స్‌ (ఏఈఐ-2026) నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌ ఫ్రంట్‌ రన్నర్

ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన సేవలు, అవకాశాలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని ఈ నివేదికలో విశ్లేషించారు.

మొత్తం 23 విభాగాలకు సంబంధించిన 60 సూచికలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు స్కోర్లు కేటాయించారు.

ఈ అంచనాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఫ్రంట్‌ రన్నర్‌గా గుర్తించారు. వివిధ విభాగాల్లో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మెరుగైన ర్యాంకులు సాధించింది.

సాధారణంగా సంపన్న రాష్ట్రాలు పౌరులకు మెరుగైన సేవలు అందిస్తాయని భావిస్తారు.

అయితే కొన్ని తక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రాలు కూడా తమ ఆర్థిక స్థాయికి మించి పనితీరు కనబరుస్తూ సంపన్న రాష్ట్రాలను అధిగమిస్తున్నాయని నివేదిక విశ్లేషించింది.

వివరాలు 

పరిశీలించిన ప్రధాన అంశాలు

రాష్ట్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, సౌకర్యాలను అంచనా వేయడానికి నాలుగు ప్రధాన విభాగాలతో పాటు పలు అంశాలను పరిశీలించారు. ప్రాథమిక వసతుల కింద తాగునీరు, పారిశుద్ధ్యం, గృహనిర్మాణం, స్వచ్ఛ ఇంధనం, పోషకాహారం, డిజిటల్‌ సౌకర్యాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఆరోగ్య సంరక్షణ విభాగంలో వైద్య మౌలిక సదుపాయాలు, ప్రజలకు భరించగలిగే ధరల్లో వైద్యం అందడం, తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.

సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో బ్యాంకింగ్‌ సేవలు, ఉపాధి, బీమా, పింఛన్లు, సామాజిక భద్రత వంటి అంశాలను విశ్లేషించారు.

న్యాయ పరిష్కారంలో భాగంగా న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, న్యాయ సహాయం, సకాలంలో న్యాయం అందించడం, న్యాయవ్యవస్థలో డిజిటలీకరణను పరిగణనలోకి తీసుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అంచనాలకు మించి ఏపీ పనితీరు

ఈ అంచనాల్లో ప్రాథమిక వసతుల విభాగంలో గోవా 0.98 స్కోరుతో ముందుంది.

సామాజిక, ఆర్థిక భద్రతలో ఆంధ్రప్రదేశ్‌ 0.69 స్కోరు సాధించింది. విద్యలో సిక్కిం 0.69, ఆరోగ్య సంరక్షణలో గోవా 0.73, న్యాయ పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ 0.65 స్కోరు నమోదు చేశాయి.

ఆయా విభాగాల్లో ఈ రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి.

మధ్యస్థ ఆదాయం కలిగిన ఆంధ్రప్రదేశ్‌.. ప్రజలకు సేవలు,సౌకర్యాలు అందించడంలో దేశంలోని సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన గోవా తర్వాతి స్థానంలో నిలిచింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి,తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుంటే ఏపీకి 0.51 స్కోరు వస్తుందని అంచనా వేశారు.

అయితే వాస్తవ పనితీరులో 0.66 స్కోరు నమోదైంది. అంటే అంచనాల కంటే 0.15 పాయింట్లు అధికంగా సాధించింది.

ADVERTISEMENT

వివరాలు 

దక్షిణాది రాష్ట్రాల మెరుగైన ప్రగతి

అభివృద్ధిని కేవలం రాష్ట్ర ఆదాయంతోనే కొలవలేమని నివేదిక పేర్కొంది. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుని వాటిని ప్రజలకు మెరుగైన అవకాశాలుగా మార్చడమే నిజమైన అభివృద్ధికి సూచిక అని వివరించింది.

2025తో పోలిస్తే 2026లో ఏఈఐ మధ్యస్థ రాష్ట్రాల స్కోరు 0.47 నుంచి 0.48కి పెరిగింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తమ పనితీరును మెరుగుపరచుకోగా.. ఐదు రాష్ట్రాల్లో స్కోర్లు తగ్గాయి. మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అత్యధికంగా 0.68 స్కోరుతో గోవా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ సూచీలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. తెలంగాణ స్కోరు 0.05 పాయింట్లు పెరిగి 0.57కి చేరింది.

వివరాలు 

ఆదాయం ఎక్కువైనా.. సేవల్లో వెనుకంజ

ఆంధ్రప్రదేశ్‌ స్కోరు 0.04 పాయింట్లు పెరిగి 0.68గా నమోదైంది. కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు 0.02 పాయింట్ల చొప్పున మెరుగుపడ్డాయి. తమిళనాడు, సిక్కిం రాష్ట్రాలు 0.01 పాయింట్ల చొప్పున పురోగతి సాధించాయి. గోవా స్కోరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

తలసరి ఆదాయంలో ఏడో స్థానంలో ఉన్న గుజరాత్‌, నాలుగో స్థానంలో ఉన్న కర్ణాటక ప్రజలకు సేవలు అందించే విషయంలో ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక స్కోరు 0.01 పాయింట్లు తగ్గి 0.50కి పడిపోయింది. గుజరాత్‌ స్కోరు 0.51 నుంచి 0.48కి తగ్గింది. మహారాష్ట్రలోనూ స్కోరు క్షీణించింది.

వివరాలు 

ఆదాయం ఎక్కువైనా.. సేవల్లో వెనుకంజ

మొత్తంగా చూస్తే.. ఈ సూచీలో అగ్రస్థానాల్లో ఉన్న రాష్ట్రాలు తమ స్థానాలను నిలబెట్టుకోగా, తక్కువ స్కోర్లు సాధించిన రాష్ట్రాలు మాత్రం ముందున్న రాష్ట్రాలతో తమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించుకున్నాయి.

రాష్ట్ర ఆదాయం ఒక్కటే అభివృద్ధికి కొలమానం కాదని, ప్రజలకు అవసరమైన సేవలు, మౌలిక వసతులు అందించడంలో చూపించే పనితీరే కీలకమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ADVERTISEMENT