LOADING...
GST: జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూసుకుపోతోంది.. జాతీయ సగటును మించిన వృద్ధి
GST: జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూసుకుపోతోంది.. జాతీయ సగటును మించిన వృద్ధి

GST: జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూసుకుపోతోంది.. జాతీయ సగటును మించిన వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్టీ వ్యవస్థలో మార్పులు అమలులోకి వచ్చినప్పటికీ, గత ఏడాది డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక నికర జీఎస్టీ వసూళ్లను నమోదు చేసింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా గత నెలలోనే రూ.2,652 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు నెలగా నిలిచింది. అంతేకాదు, గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు వరుసగా తొమ్మిది నెలల పాటు ప్రతి నెలా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని అదే కాలంతో పోలిస్తే అధిక జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం గమనార్హం. ఇది రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవడం, వస్తువుల వినియోగం పెరగడం స్పష్టంగా సూచిస్తోందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్‌ ఎ.బాబు తెలిపారు.

వివరాలు 

జాతీయ సగటును మించి రాష్ట్రంలో జీఎస్టీ నికర వసూళ్లు

దిగుమతులను పక్కనపెట్టి పరిశీలిస్తే దేశవ్యాప్తంగా సగటు జీఎస్టీ వృద్ధి రేటు 5.61శాతంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇది 5.78 శాతానికి చేరడం విశేషం. ఈ విధంగా జాతీయ సగటును మించి రాష్ట్రంలో జీఎస్టీ నికర వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబరు చివరి వరకు మొత్తం తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో రూ.39,517కోట్ల జీఎస్టీ వసూళ్లు లభించగా,కేంద్రానికి,ఇతర వాటాలకు వెళ్లే మొత్తాన్ని మినహాయించిన తర్వాత రూ.25,926 కోట్ల నికర జీఎస్టీ ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరింది. దక్షిణాది రాష్ట్రాల మధ్య జీఎస్టీ వృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. 7.85 శాతం వృద్ధితో తమిళనాడు తొలి స్థానంలో నిలవగా,కర్ణాటక(5.12%),కేరళ(3.69%),తెలంగాణ (2.45%)రాష్ట్రాలను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన వృద్ధిని సాధించడం విశేషంగా అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

ఐజీఎస్టీ సర్దుబాట్ల వల్ల కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు

రాష్ట్రంలో ముఖ్యంగా ఆటోమొబైల్‌, సిమెంట్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో గణనీయమైన పురోగతి కనిపించగా, ఈ రంగాల్లో కలిపి 23.69 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది డిసెంబరు నెలలో రాష్ట్ర ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.1,102 కోట్లకు చేరగా, 2024 డిసెంబరుతో పోలిస్తే ఇందులో 2.46 శాతం పెరుగుదల నమోదైంది. అలాగే ఐజీఎస్టీ సర్దుబాట్ల వల్ల కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది. ఐజీఎస్టీ సర్దుబాట్ల రూపంలో రాష్ట్రానికి రూ.1,549 కోట్ల ఆదాయం లభించగా, ఇది 2024 డిసెంబరు నెలతో పోలిస్తే 8.29 శాతం వృద్ధిగా నమోదైంది. పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాల ద్వారా రాష్ట్రానికి రూ.1,448 కోట్ల ఆదాయం లభించగా, ఇది గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే 3.89 శాతం అధికం.

Advertisement

వివరాలు 

2025 డిసెంబరు నెలలో ఆశాజనక ఫలితాలు

వృత్తి పన్ను వసూళ్లలో కూడా 2025 డిసెంబరు నెలలో ఆశాజనక ఫలితాలు నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే ఈ వసూళ్లు 38.32 శాతం మేర పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. జీఎస్టీ స్థూల, నికర వసూళ్లలో తొలి త్రైమాసికంలో కనిపించిన తగ్గుదల పరిస్థితులను అధిగమించి మళ్లీ వృద్ధి బాట పట్టేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ ఫలితాలకు కారణమని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement