Loading...
Andhra Pradesh: ఏపీలో భారీ స్పేస్ సిటీ.. శ్రీహరికోట సమీపంలో రూ.25 వేల కోట్లతో భారీ ప్రణాళిక 
ఏపీలో భారీ స్పేస్ సిటీ.. శ్రీహరికోట సమీపంలో రూ.25 వేల కోట్లతో భారీ ప్రణాళిక

Andhra Pradesh: ఏపీలో భారీ స్పేస్ సిటీ.. శ్రీహరికోట సమీపంలో రూ.25 వేల కోట్లతో భారీ ప్రణాళిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష రంగంలో దేశంలోనే కీలక కేంద్రంగా ఎదిగేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత అంతరిక్ష ప్రయోగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న శ్రీహరికోటకు సమీపంలో భారీ స్పేస్ సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని స్పేస్ టెక్నాలజీ,రాకెట్ తయారీ, ఉపగ్రహ పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన 31వసీఐఐ భాగస్వామ్య సదస్సులో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రాకెట్ ఇంజన్ల తయారీ, ప్రొపల్షన్ వ్యవస్థలు,పరీక్ష కేంద్రాల ఏర్పాటు వంటి విభాగాల్లో పనిచేస్తున్న పలు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో మొత్తం రూ.1,800కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేసింది.

వివరాలు 

గతంలో ప్రతిపాదన.. ఇప్పుడు కార్యాచరణ

ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్,బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, హాథోర్ రాకెట్స్ వంటి అంతరిక్ష రంగ అంకుర సంస్థలు ఏపీలో తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి.

రాష్ట్రంలో స్పేస్ పార్కు ఏర్పాటు చేయాలనే ఆలోచన గతంలోనూ ఉన్నప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు.

అయితే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

అంతరిక్ష రంగ సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడిదారులకు అవసరమైన భూమి,ఇతర సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తోంది.

కర్ణాటకలో భూమి అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిక్సెల్ వంటి స్టార్టప్ సంస్థను మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ఆహ్వానించడం ఈ ప్రయత్నాల్లో భాగమే. ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చని ఆ సంస్థకు భరోసా ఇచ్చారు.

వివరాలు 

ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు?

ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అంతరిక్ష పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

శ్రీసత్యసాయి జిల్లా తిమ్మసముద్రంలో 339 ఎకరాల విస్తీర్ణంలో రూ.800 కోట్ల పెట్టుబడితో రాకెట్ ఇంజన్ల పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ నిర్ణయించింది.

ఈ పరిశ్రమ ద్వారా సుమారు 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

అదే జిల్లాలోని లేపాక్షిలో బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థ 120 ఎకరాల్లో రూ.550 కోట్లతో ఉపగ్రహాలు, ప్రొపల్షన్ వ్యవస్థలకు సంబంధించిన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా 565 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు?

తిరుపతి స్పేస్ సిటీలో అగ్నికుల్ కాస్మోస్ సంస్థ రూ.510 కోట్ల పెట్టుబడితో తిరిగి ఉపయోగించుకునే రాకెట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

ఇదే ప్రాంతంలో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూ.400 కోట్లతో రాకెట్ల తయారీ, అసెంబ్లింగ్ కేంద్రాన్ని నెలకొల్పనుంది.

మరోవైపు తిరుపతి జిల్లా రౌతుసురమాల వద్ద రూ.250 కోట్ల పెట్టుబడితో లిక్విడ్ రాకెట్ ఇంజన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని హాథోర్ రాకెట్స్ నిర్ణయించింది.

ఈ పరిశ్రమ ద్వారా మరో 200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

వేలాది మందికి ఉపాధి అవకాశాలు

అంతరిక్ష రంగానికి సంబంధించిన పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు కావడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రాకెట్ తయారీ, ఉపగ్రహ పరిశోధనలు, ఇంజన్ల పరీక్షలు, ప్రొపల్షన్ సాంకేతికత వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఆయా సంస్థల్లో ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సేవారంగాల ద్వారా పరోక్ష ఉపాధి కూడా పెరుగుతుందని అంచనా వేస్తోంది.

మొత్తం మీద రూ.25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో చేపట్టిన స్పేస్ సిటీ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా మారనుంది.

ADVERTISEMENT