Page Loader
ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం
మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం

ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం

వ్రాసిన వారు Stalin
Apr 17, 2023
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్లకు డిమాండ్ ఏర్పడింది. గత నాలుగు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో గ్రిడ్ గరిష్ట డిమాండ్ అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి ఆదివారం వరకు 240 మిలియన్ యూనిట్ల(ఎంయూ)కు తగ్గకుండా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏప్రిల్‌లో ఎంయూ ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే, ఈ ఏప్రిలో విద్యుత్ వినియోగం 5 నుంచి 6శాతం అదనంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా కరెంట్‌ను సరఫరా చేయాడనికి అధికారులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

గతేడాది గ్రిడ్ గరిష్ట డిమాండ్‌ను అదిగమించిన ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో గతం నాలుగు రోజుల్లోనే ఎండలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోత జతకావడంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. 2022లో ఏప్రిల్ 8వ తేదీన గ్రిడ్ గరిష్ట డిమాండ్ 12,292మెగావాట్లు కాగా, ఈ ఏడాది దాన్ని అధిగమంచింది. ఈ నెల 14(శుక్రవారం)వ తేదీన గ్రిడ్ గరిష్ట డిమాండ్ 12,494కు పెరిగింది. అయితే ఇది తెలంగాణ గ్రిడ్ గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే కేవలం 137 మెగావాట్లు మాత్రమే తక్కువ కావడం గమనార్హం. మే నెలలో ఎండులు ఇంకా మండే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రిడ్ డిమాండ్ పెరిగి 13,500 మెగావాట్లుకు చేరినా ఆశ్చర్యపోనసరం లేదని అధికారులు చెబుతున్నారు.