Page Loader
Sea plane: విజయవంతమైన విజయవాడ-శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్ 

Sea plane: విజయవంతమైన విజయవాడ-శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ నుండి శ్రీశైలానికి సీ ప్లేన్ ప్రయోగం విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి బయలుదేరిన సీ ప్లేన్ శ్రీశైలం జలాశయానికి చేరుకుని అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం, శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఈ ట్రయల్ రన్‌ను ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారులు పర్యవేక్షించారు. ఈ నెల 9వ తేదీన పున్నమిఘాట్ వద్ద విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ పర్యాటక సేవలు ప్రారంభం కానున్నాయి. డీ హవిల్లాండ్ సంస్థ తయారు చేసిన 14 సీట్ల ఈ సీ ప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజయవాడ-శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్