Page Loader
Supreme Court-Sand Mining: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..అక్రమ ఇసుక తవ్వకాలు తక్షణమే నిలిపివేయండి: సుప్రీంకోర్టు  
భారత సర్వోన్నత న్యాయస్థానం

Supreme Court-Sand Mining: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..అక్రమ ఇసుక తవ్వకాలు తక్షణమే నిలిపివేయండి: సుప్రీంకోర్టు  

వ్రాసిన వారు Stalin
Apr 29, 2024
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై (Sand Mining) సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది . అనుమతులు లేని తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పును కచ్చితంగా అమలు చేయాలని, అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వచ్చే నెల 9 లోపు ఈ అంశంపై అఫిడవిట్ ను దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున అఫిడవిట్ దాఖలుకు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది సమయం కావాలని కోరారు.

Sand Mining-SupremeCourt-Ap

ఎన్నికల కంటే పర్యావరణమే ముఖ్యం: సుప్రీం కోర్టు

అయితే ఈ అభ్యర్థులను సుప్రీంకోర్టు చూసింది ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.