Andhra News: 2 కొత్త జిల్లాలు.. 6 కొత్త రెవెన్యూ డివిజన్లు.. 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం
ఈ వార్తాకథనం ఏంటి
ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చడం,కైకలూరు ని కృష్ణా జిల్లాకే కొనసాగించడం, అలాగే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి విడదీసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపడం వంటి ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూల స్పందన తెలిపింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలా లేదా అన్న విషయంపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకొని రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. అదనంగా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతో పాటు మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా అనుకూలతనే వ్యక్తం చేసింది.
వివరాలు
మూడు రోజుల్లోనే తుది నివేదిక
సర్కారు పాలనా సౌలభ్యం, ప్రజల అభిలాషల ఆధారంగానే మార్పులు చేస్తున్నామని చెబుతున్నా... అదే ప్రజలు కోరుతున్నట్లు విజయవాడ నగర పరిధిలోకి వచ్చే పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చే అంశాన్ని మాత్రం పూర్తిగా పక్కనపెట్టింది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దు సవరణలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమై నాలుగు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించింది. మూడు రోజుల్లోనే తుది నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖకు ఆదేశించింది.
వివరాలు
పెనమలూరు.. స్థానిక ప్రజాప్రతినిధులే మోకాలడ్డు?
పెనమలూరు నియోజకవర్గం నిజంగానే విజయవాడ నగర భాగం. అయినా వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాను కాదని కృష్ణా జిల్లాలో చేర్చింది. ఫలితంగా, పెనమలూరు ప్రజలు ఏ చిన్న ప్రభుత్వ పని కోసం వెళ్లినా జిల్లా కేంద్రం మచిలీపట్నానికి 65 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులు కలిపితే రూ.500 వరకు భారం పడుతోంది. అందువల్ల పెనమలూరును తిరిగి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అనేది ప్రజల స్పష్టమైన డిమాండ్. అయితే స్థానిక ప్రజాప్రతినిధులే ఈ విషయంపై అడ్డంగా నిలుస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పాలనా సౌలభ్యం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెప్పినా, మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాన్ని పరిశీలనకు కూడా తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు
ఆ రెండు డివిజన్లతో పోలవరం అథారిటీ!
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రం పాడేరు వెళ్లాలంటే దాదాపు ఒక రోజంతా ప్రయాణం చేయాల్సి వస్తోంది. అయితే ఈ రెండు డివిజన్లను ఒక కొత్త జిల్లాగా చేస్తే పరిమాణం చాలా చిన్నదవుతుంది. ముందుగా ఈ ప్రాంతాలను తూర్పుగోదావరి జిల్లాలోకి చేర్చే ప్రతిపాదన ఉన్నా, గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి మారిస్తే సమస్యలు తలెత్తుతాయేమో అనే కోణంలో ఇప్పుడు పరిశీలిస్తున్నారు.
వివరాలు
మొత్తం రాష్ట్రంలో 6 కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చే అవకాశం
రాష్ట్రంలో ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్లు ఉండగా,వాటితో పాటు ఇంకా ఆరు డివిజన్లు ఏర్పడవచ్చు. నక్కపల్లి కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు హోం మంత్రి అనిత చేసిన ప్రతిపాదనపై కూడా ఉపసంఘం సానుకూలంగా ఉంది. అలాగే బనగానపల్లి, అవనిగడ్డ వంటి ప్రదేశాల్లో కొత్త డివిజన్ల ఏర్పాటు పై కూడా చర్చ జరిగింది.
వివరాలు
రెవెన్యూ డివిజన్ల మార్పుచేర్పులపై కొన్ని ప్రధాన ప్రతిపాదనలు
శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగాం మండలం టెక్కలి డివిజన్‌లోకి పెదబయలు మండలాన్ని విభజించి గోమంగి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గంలోని మండపేట, కపిలేశ్వరం, రాయవరం మండలాల్ని తూర్పుగోదావరి జిల్లాలోకి తెచ్చి రాజమహేంద్రవరం డివిజన్‌లో కలపాలి. రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలాన్ని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం డివిజన్‌లో కలపాలి. కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్‌లోకి తేవాలి. భీమవరం డివిజన్‌లోని గణపవరం మండలాన్ని ఏలూరు డివిజన్‌లో కలపాలి. నూజివీడు డివిజన్‌లోని చింతలపూడి, లింగపాలెం మండలాల్ని జంగారెడ్డిగూడెం డివిజన్‌లో చేర్చాలి.
వివరాలు
రెవెన్యూ డివిజన్ల మార్పుచేర్పులపై కొన్ని ప్రధాన ప్రతిపాదనలు
నూజివీడు నియోజకవర్గంలోని 4 మండలాలతోపాటు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్ని నూజివీడు డివిజన్‌లో కలపాలి. వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరు నుంచి వీరులపాడుకు మార్చాలి. ఏలూరు డివిజన్‌లోని మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాల్ని గుడివాడ డివిజన్‌లో కలపాలి. బాపట్ల జిల్లాలోని అద్దంకి, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చాలి. కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి, ఆ నియోజకవర్గంలోని 5 మండలాలతోపాటు ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్ని కలపాలి. దర్శి, దొనకొండ, కురిచేడు మండలాల్ని కందుకూరు డివిజన్‌లో చేర్చాలి.
వివరాలు
రెవెన్యూ డివిజన్ల మార్పుచేర్పులపై కొన్ని ప్రధాన ప్రతిపాదనలు
బాపట్ల రెవెన్యూ డివిజన్‌లోని పర్చూరు, మార్టూరు, యద్దనపూడి మండలాల్ని చీరాల రెవెన్యూ డివిజన్‌లో చేర్చాలి. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, కొండాపురం, జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, సీతారామపురం మండలాల్ని కావలి డివిజన్‌లోకి తేవాలి. విడవలూరు, కొడవలూరు మండలాల్ని కావలి నుంచి నెల్లూరు డివిజన్‌కు మార్చాలి. వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల్ని గూడూరు డివిజన్‌లోకి తేవాలి. వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్ని శ్రీకాళహస్తి డివిజన్‌లో కలపాలి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలపాలి. నగరి నియోజకవర్గంలోని నగరి, విజయపురం, నిండ్ర మండలాల్ని తిరుపతి జిల్లాలోకి తేవాలి. వడమాలపేట, పుత్తూరు మండలాలను నగరి డివిజన్‌లో కలపాలి.
వివరాలు
రెవెన్యూ డివిజన్ల మార్పుచేర్పులపై కొన్ని ప్రధాన ప్రతిపాదనలు
నగరి డివిజన్‌లోని కార్వేటినగరం, పాలసముద్రం మండలాల్ని.. పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్‌లో కలపాలి. మడకశిర, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగలి మండలాలతో మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. కదిరి డివిజన్‌లోని అమడగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్లలోకి తేవాలి. పుట్టపర్తి డివిజన్‌లోని గోరంట్ల మండలాన్ని పెనుగొండ డివిజన్‌లో కలపాలి.