Page Loader
ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ
18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ

ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ

వ్రాసిన వారు Stalin
Feb 20, 2023
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) వివిధ కోటాల కింద మార్చి 13, 2023న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 18 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం చేసినట్లు సజ్జల చెప్పారు. 18 మంది పేర్లలో 11 మంది బీసీలు, 4 ఓసీలు, 2 ఎస్సీలు, ఒక ఎస్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ బరిలోకి దింపుతోంది.

ఎన్నికలు

ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఇదే

గవర్నర్ కోటా: కుంభ రవిబాబు కర్రి పద్మశ్రీ ఎమ్మెల్యే కోటా: పెనుమత్స సుబ్బరాజు పోతుల సునీత బొమ్మి ఇజ్రాయిల్ కోలా గురువులు యేసు రత్నం మర్రి రాజశేఖర్ వంక రవీంద్రనాథ్ స్థానిక సంస్థల నియోజకవర్గాలు: అనంతపురం- మంగమ్మ వైఎస్ఆర్ కడప-పొన్నపురెడ్డి రాంసుబ్బారెడ్డి కర్నూలు - డాక్టర్ మధుసూధన్ చిత్తూరు -డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం నెల్లూరు -మేరుగ మురళీధర్ పశ్చిమగోదావరి -జయమంగళ వెంకటరమణ పశ్చిమగోదావరి- వంక రవీంద్రనాథ్ పశ్చిమగోదావరి - కావూరు శ్రీనివాస్ తూర్పుగోదావరి - కుడుపూడి సూర్యనారాయణ శ్రీకాకుళం - నాథు రామారావు ఎన్నికల షెడ్యూల్: నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: 23 ఫిబ్రవరి 2023 నామినేషన్ల పరిశీలన: 24 ఫిబ్రవరి 2023 పోల్ తేదీ: 13 మార్చి 2023

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభ్యర్థులు జాబితాను ట్వీట్ చేసిన వైఎస్సార్సీపీ