LOADING...
RTC BUS: మరో బస్సు ప్రమాదం.. విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం
RTC BUS: మరో బస్సు ప్రమాదం..విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం

RTC BUS: మరో బస్సు ప్రమాదం.. విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. విశాఖపట్టణం నుండి జయపుర వైపు ప్రయాణిస్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా అగ్నికి ఆహుతైంది. గురువారం ఉదయం సుమారు 7.45 గంటల సమయంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఉన్న ఘాట్‌ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌ భాగం నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్‌ వెంటనే జాగ్రత్తగా వాహనాన్ని ఆపి, ప్రయాణికులను ఒకొక్కరిని కిందకు దింపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పి, ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

వివరాలు 

ఘటనపై మంత్రి సంధ్యారాణి ఆరా 

ఘటన వివరాలను అధికారులు ద్వారా అడిగి మంత్రి సంధ్యారాణి సమీక్షించారు. సమాచారం అందిన వెంటనే ఆమె అగ్నిమాపక వాహనాన్ని అక్కడికి పంపించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు మంత్రికి తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు