Page Loader
తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియామకం

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

వ్రాసిన వారు Stalin
Dec 30, 2022
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా 1990 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నఅంజనీకుమార్‌కు తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల31న పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి అంజనీ కుమార్‌ డీజీపీగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. 2018లో మహేందర్ రెడ్డి నుంచి అంజనీ కుమార్‌ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ మూడున్నరేళ్ల తర్వాత ఇప్పుడే అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం.

డీజీపీ

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అంజనీ కుమార్ అనేక కార్యక్రమాలను చేపట్టారు. పోలీసు సిబ్బంది పని పరిస్థితుల గురించి పోలీసు సిబ్బంది కుటుంబాలకు అవగాహన కల్పించి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నగరంలో నేరాలను అదుపులోకి తేవడానికి సైకిల్ పెట్రోలింగ్ ప్రారంభించడంలో అంజనీ కుమార్ కీలక పాత్ర పోషించారు. పౌరులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచి ఫిర్యాదు చేసే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో కూడా అంజనీ కుమార్ కీలకంగా వ్యవహరించారు.