Pulivendula ZPTC Election Results: పులివెందులలో వైసీపీకి మరో షాక్.. జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ!
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దాని కంచుకోటగా భావించే పులివెందులలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ.. తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూసింది. ఈరోజు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. కొన్ని రోజుల క్రితం జరిగిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
వివరాలు
తన
తాజాగా జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం కావడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి.
మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో పులివెందుల టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ విజయోత్సవాలు జరుపుకున్నారు. వరుస విజయాలతో టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.