Page Loader
యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌; అనిల్ దుజానా హతం 

యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌; అనిల్ దుజానా హతం 

వ్రాసిన వారు Stalin
May 04, 2023
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్యాంగ్‌స్టర్ల వేట కొనసాగుతోంది. మీరట్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను హతమార్చారు. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని బాదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుజానా గ్రామానికి చెందినవాడు. అనిల్ దుజానా అసలు పేరు అనిల్ నగర్. దుజానాకు యూపీలో కరడుగట్టిన రౌడీగా పేరుంది. 18 హత్యలు, దోపిడీలు, భూకబ్జాలు సహా 62 క్రిమినల్ కేసుల్లో అనిల్ దుజానా నిందితుడిగా ఉన్నాడు. ఝాన్సీలో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌ తర్వాత యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హతమార్చిన రెండవ హై ప్రొఫైల్ కేసు ఇది కావడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల మరో ఎన్‌కౌంటర్