LOADING...
Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!
తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!

Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ భవనాల్లో కొనసాగించవద్దని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలకు అధికారిక ఆదేశాలు పంపించారు. అలాగే 2026 ఫిబ్రవరి 1 నుంచి ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Details

డిసెంబర్ 31లోపు షిఫ్ట్‌ కావాల్సిందే

ప్రస్తుతం ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం అవసరమైన ప్రభుత్వ భవనాలను కేటాయించాలని అన్ని శాఖలకు సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత శాఖాధిపతులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆ తర్వాత కూడా అద్దెలు చెల్లించాల్సి వస్తే ఆ ఖర్చు వారే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాల్లోకి కార్యాలయాలు, యూనివర్సిటీలను తరలించాలని స్పష్టం చేసింది.

Details

రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం

ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని వ్యవసాయ సహకార పరిమితి సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. ఈ మేరకు వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన డీసీసీబీల పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంఘాల నిర్వహణను తాత్కాలికంగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

Advertisement