ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ
దిల్లీలో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గాలిస్తోంది. ఈ మేరకు శనివారం దిల్లీలో విస్తృత సోదాలు నిర్వహించింది. ముగ్గురు ఉగ్రవాదులు దేశ రాజధానిలో తలదాచుకున్న ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఎన్ఐఏ వెతుకుతున్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లను ఎన్ఐఏ విడుదల చేసింది. మహ్మద్ షానవాజ్ ఆలం అలియాస్ షఫీ ఉజ్జమా అలియాస్ అబ్దుల్లా, రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్‌ను ఉగ్రవాదులుగా పేర్కొంటూ వీరిపై ఎన్ఐఏ రూ.3 లక్షల రివార్డును ప్రకటించింది. వీరు పుణె ఐసిస్ మాడ్యూల్ కేసులో నిందితులుగా ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. పుణె పోలీసులు, ఎన్‌ఐఏ గతంలో ఈ విషయమై సెంట్రల్ దిల్లీలోని ప్రాంతాల్లో దాడులు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు.