AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ @ రూ.2.85లక్షల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రూ.2లక్షల 86వేల 389కోట్లతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.
బుగ్గన మహాత్మాగాంధీ సందేశంతో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. వరుసగా ఐదేళ్ల పాటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు.
వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రవిత గ్రంథంగా భావించినట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని గొప్ప పనులను తాము చేసినట్లు వివరించారు. గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు చేరవేసినట్లు చెప్పారు.
ఏపీ
రెవెన్యూ వ్యయం రూ.2.30కోట్లు
2024కు సంబంధించిన బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లుగా బుగ్గన పేర్కొన్నారు.
మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లని చెప్పారు. ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లుగా, రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లుగా వివరించారు.
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతంగా ఉందని, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతమని బుగ్గన ప్రకటించారు.
వైసీపీ హయాంలో 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం జరిగందన్నారు. రాష్ట్రంలోని జిల్లాలను 26కు పెంచినట్లు చెప్పారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, 1000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్, రూ.3367కోట్లతో జగనన్న విద్యాకానుక, 47లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన బుగ్గన
AP Budget 2024: ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్#apbudget2024 #apbudget #apassembly #Money9Telugu #TV9Telugu TV9d pic.twitter.com/UYQkEZ6OHp
— Money9 Telugu (@Money9Telugu) February 7, 2024