LOADING...
AP Cabinet: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై ఆమోదం!
సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై ఆమోదం!

AP Cabinet: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై ఆమోదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగింది. మొత్తం 70 అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు, వివిధ సంస్థలకు భూ కేటాయింపుపై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, కొత్త పరిశ్రమల స్థాపనకు భూ కేటాయింపులో రాయితీలు, రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ వంటి అంశాలపై క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అజెండాపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడారు.

Details

మొంథా తుపాను సేవలపై మంత్రులను అభినందించిన సీఎం

ఇటీవల సంభవించిన మొంథా తుపాను సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజలకు తక్షణ సాయం అందించినందుకు మంత్రులు, అధికారులను సీఎం అభినందించారు. ఆర్టీజీఎస్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని, అందరూ కలసి కృషి చేసిన తీరును స్వయంగా చూశానని చంద్రబాబు అన్నారు. ఇళ్ల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. పేదలకు ఇళ్లు అందేలా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని సూచించారు.

Details

పేదలకు ఇళ్ల పంపిణీపై సీఎం సూచనలు

నివాస స్థలం లేని వారి జాబితాను తయారు చేసి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి చేర్చే బాధ్యత కూడా మంత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని, తక్షణ చర్యలు తీసుకునే విధంగా ఒక సమర్థమైన వ్యవస్థను రూపుదిద్దాలని సీఎం సూచించారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.