
AP Cabinet: ముగిసిన ఏపీ మంత్రివర్గ భేటీ.. నాలా ఫీజు రద్దు..13 అంశాలకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న దాదాపు 13 బిల్లుల అంశాలకు ఆమోదం లభించింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత వివిధ చట్టాలను సవరిస్తూ,నాలా ఫీజు రద్దు కోసం కావలసిన మార్పులను మంత్రిమండలి పరిశీలించింది. ఇందుకు సంబంధించిన నిర్ణయాలు క్యాబినెట్ భేటీలో సవరించారు. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు సవరిస్తూ, అది తాడిగడప మున్సిపాలిటీగా ఉంచడానికి మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది. అలాగే, ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి మరో మూడు ప్రత్యేక తేదీలను ఖరారు చేయాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం లభించింది. రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం
అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. pic.twitter.com/20lMQs6FLA
— I & PR Andhra Pradesh (@IPR_AP) September 19, 2025