LOADING...
Census: ఏపీ జనగణన షెడ్యూల్ ఫిక్స్‌.. మే 1 నుంచి ఇళ్ల సర్వే ప్రారంభం!
ఏపీ జనగణన షెడ్యూల్ ఫిక్స్‌.. మే 1 నుంచి ఇళ్ల సర్వే ప్రారంభం!

Census: ఏపీ జనగణన షెడ్యూల్ ఫిక్స్‌.. మే 1 నుంచి ఇళ్ల సర్వే ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్న జనగణన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మే 1 నుంచి మే 30 వరకు ఇళ్ల సర్వే నిర్వహించనున్నారు. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. అంతేకాదు, పౌరులు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే విధంగా 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ విండో అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో పౌరులు అధికారిక పోర్టల్ [https://se.census.gov.in](https://se.census.gov.in) ద్వారా తమ ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, మ్యాప్‌లో తమ లొకేషన్‌ను గుర్తించి, ఇంటి వివరాలను పూరించి సమర్పించాలి.

వివరాలు

ఇంటికి వచ్చే గణకులకు తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది

సమాచారం సమర్పించిన తర్వాత 'సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ' జారీ అవుతుంది. ఈ ఐడీని ధృవీకరణ కోసం ఇంటికి వచ్చే గణకులకు తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ఇక ఆఫ్‌లైన్ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా హెచ్ఎల్ఓ (HLO) మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించారు. దీని ద్వారా గణకులు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా అందిన సమాచారంలో ఏవైనా తేడాలు ఉంటే, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి సరిదిద్దుతారు. పూర్తి స్థాయి కవరేజీ కోసం ఇళ్ల జాబితా ఉన్న బ్లాక్‌లను వెబ్ ఆధారిత జియో-రిఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా మ్యాప్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1.08 లక్షల మంది గణన సిబ్బందిని నియమించింది.

వివరాలు

ముఖ్యమైన తేదీలు

ఇప్పటికే జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయి శిక్షకులకు ఏప్రిల్ 9 నుంచి 22 వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మే 1 నుంచి 30 వరకు ఇళ్ల సర్వే ఏప్రిల్ 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ రెండో దశ జనాభా లెక్కింపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జనగణనలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలతో పాటు వలసలు, సంతానోత్పత్తి స్థితిగతులకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. రెండో దశలో కులగణన వివరాలు కూడా నమోదు చేయనున్నారు. మొత్తం ప్రక్రియ కోసం కేంద్రం సుమారు రూ. 11,718 కోట్లను ఖర్చు చేస్తోంది. 16 భాషల్లో మొబైల్ యాప్ ద్వారా జనగణన చేపట్టనున్నారు.

Advertisement