Page Loader
Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ
చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ

వ్రాసిన వారు Stalin
Nov 21, 2023
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ భావిస్తోంది. సీఐడీ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమచారం. బెయిల్ మంజూరులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తన అధికార పరిధిని అతిక్రమించిందని సీఐడీ వాదిస్తోంది. హైకోర్టు బెయిల్ ఆర్డర్ పారామీటర్స్ ప్రకారం లేదని సీఐడీ చెబుతోంది. కేసు మెరిట్‌లలోకి వెళ్లకూడదని పేర్కొంటూనే, ఈ విషయం మెరిట్‌లపై తీర్పును ప్రకటించి.. హైకోర్టు తన అధికార పరిధిని దాటిపోయినట్లు సీఐడీ అభిప్రాయపడుతోంది. బెయిల్ విచారణను సద్వినియోగం చేసుకుని టీడీపీ నేతలు దర్యాప్తులో సీఐడీ అడిగిన సమాచారం ఇవ్వలేదని విషయాన్ని సీఐడీ పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేడు సుప్రీంకోర్టుకు ఏపీ సీఐడీ