Loading...
AP Draft Electoral Roll Released: ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల.. 
ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల..

AP Draft Electoral Roll Released: ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)వివేక్ యాదవ్ మాట్లాడుతూ,మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించినట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నమోదైన మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 89.22శాతం మంది ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. పరిశీలనలో భాగంగా 15.22లక్షల మంది మృతులుగా గుర్తించగా, మరో 22.30లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిపోయినట్లు లేదా ప్రస్తుతం ఆచూకీ లేని వారిగా నిర్ధారించారు. అలాగే 7.37లక్షల మంది పేర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

వివరాలు 

ముసాయిదా ఓటరు జాబితాపై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు

ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదైన వారి పేర్లను పరిశీలించి, ఒకే నియోజకవర్గంలో మాత్రమే కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

పేర్లు తొలగించబడినప్పటికీ అర్హత కలిగిన నిజమైన ఓటర్లు ఫారం-6 ద్వారా తిరిగి తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ముసాయిదా ఓటరు జాబితాపై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

వాటిని పరిశీలించి పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడడం ఎన్నికల సంఘం లక్ష్యం 

రాష్ట్రంలోని అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాలను అధికారికంగా అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఎలాంటి నోటీసు ఇవ్వకుండా లేదా విచారణ నిర్వహించకుండా ఏ ఓటరు పేరునూ జాబితా నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు.

అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడడం ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని సీఈవో వివేక్ యాదవ్ తెలిపారు.

అదే సమయంలో అనర్హులు ఓటరు జాబితాలో చేరకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా సవరణ ప్రక్రియను కొనసాగించేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల

ADVERTISEMENT