Loading...
AP DSC 2026: ఏపీ డీఎస్సీ 2026 ఖాళీల వివరాలు విడుదల.. ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులంటే?
ఏపీ డీఎస్సీ 2026 ఖాళీల వివరాలు విడుదల.. ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులంటే?

AP DSC 2026: ఏపీ డీఎస్సీ 2026 ఖాళీల వివరాలు విడుదల.. ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ-2026 ద్వారా మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను బుధవారం వెల్లడించింది. ప్రభుత్వ,జిల్లా పరిషత్,మండల పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం ప్రకటించిన పోస్టుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల పరిధిలో 1,709 ఖాళీలు ఉన్నాయి. మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో మరో 402 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు 1,205 ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీ పరిధిలో 1,069 పోస్టులు ఉండగా, మున్సిపల్ పాఠశాలల్లో 136 ఖాళీలు ఉన్నాయి.

వివరాలు 

హిందీ సబ్జెక్టులో అత్యధిక పోస్టులు

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సబ్జెక్టుల వారీగా వివరాలను కూడా విద్యాశాఖ వెల్లడించింది.

హిందీ సబ్జెక్టులో అత్యధికంగా 202 పోస్టులు ఉన్నాయి.

సోషల్ స్టడీస్‌లో 160, బయోలాజికల్ సైన్స్‌లో 151, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 110 ఖాళీలు ఉన్నాయి.

తెలుగు, ఉర్దూ, తమిళం వంటి భాషా సబ్జెక్టులకు కలిపి 110 పోస్టులు కేటాయించారు.

ఇంగ్లీష్‌లో 87, ఫిజికల్ సైన్సెస్‌లో 45, గణితంలో 41 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఇదిలా ఉండగా, మొత్తం 2,721 ఖాళీలతో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ రూపొందించారు.

ఇందులో భాగంగా ప్రస్తుతం 2,111 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు.

వివరాలు 

డిసెంబర్ 20 నుంచి సీబీటీ నిర్వహణ 

వీటితోపాటు 350 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లలో మరో 260 పోస్టులు ఉన్నాయి.

ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది.

డిసెంబర్ 20 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నారు.

పోస్టుల వారీగా అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ, ఇతర పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ను సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు.

ADVERTISEMENT