LOADING...
Telangana: మణికొండలో కాల్పుల కలకలం..మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ దౌర్జన్యం
మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ దౌర్జన్యం

Telangana: మణికొండలో కాల్పుల కలకలం..మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ దౌర్జన్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2025
06:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో కాల్పుల ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. మణికొండ పంచవటి కాలనీలో భూమి వివాదం కారణంగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరపడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. పంచవటి కాలనీలోని తమ స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రభాకర్ ఒత్తిడి తెచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఖాళీ చేస్తారా లేదా అంటూ హెచ్చరిస్తూ, ప్రభాకర్ తన తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఆకస్మిక ఘటనతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వివరాలు 

పలు సెక్షన్ల కింద ప్రభాకర్‌పై కేసు నమోదు

తర్వాత ప్రభాకర్ అనుచరులు బాధితులను బలవంతంగా స్థలం నుంచి బయటకు పంపించి, గేటుకు తాళం వేశారని చెబుతున్నారు. ప్రభాకర్ తమ ఆస్తిని బలవంతంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, దీనిపై అధికారుల జోక్యం అవసరమని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై వారు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ భూమిని ఆక్రమించిన ప్రభాకర్‌తో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు పలు సెక్షన్ల కింద ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.