
AP Volunteers : వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎంత జీతం పెంచుతున్నారంటే
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు వాలంటీర్ల జీతాలు పెంచనున్నట్లు ప్రకటించింది.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు బహుమానం ప్రకటిస్తున్నామని, ఈ మేరకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
జనవరి 1 నుంచి వాలంటీర్లకు గౌరవ భృతిని రూ.5 వేల నుంచి రూ.5,750కి పెంచుతున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్'లు రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని, అందుకే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని అంటున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నా మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి కారుమూరి విశ్వాసం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రూ.750 జీతం పెంచుతున్నామన్న ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
🔥 *వలంటీర్లకు రూ.750 అదనంగా ఇవ్వబోతున్నాం. ఇవాళ CM జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నాం. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. జనవరి 1 నుంచే ఇది అమలవుతుంది. ≈ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.*#IncreaseVolunteersHonorarium pic.twitter.com/emLqh2losQ
— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) December 21, 2023