
Ramayapatnam Port: రామాయపట్నం పోర్టుపై సర్కార్ ఫోకస్.. పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టి.. ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ..
ఈ వార్తాకథనం ఏంటి
రామాయపట్నం పోర్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పోర్టు కనెక్టివిటీ పెంపుదలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియను సమీక్షించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ ఉపసభ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ,మౌలిక వసతులు,పెట్టుబడులు(ఐ అండ్ ఐ),టూరిజం శాఖల మంత్రులతో ఈ ఉపసభను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రామాయపట్నం పోర్టు అభివృద్ధికి సంబంధించి పునరుద్ధరణ,డ్రెడ్జింగ్ పనులు, అంతర్గత, బాహ్య రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ మంత్రుల ఉపసభ కమిటీ పరిశీలించనుంది. అందులో భాగంగా ఈ ప్రతిపాదనలను సమగ్రమైనంగా అధ్యయనం చేసి, తగిన సిఫార్సులు చేయాలని ప్రభుత్వం కమిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
ఫేజ్ -1 పనులను పూర్తి చేయడానికి సమయం పొడిగింపు
అంతేకాకుండా, రామాయపట్నం పోర్టు తొలి దశ పనులను పూర్తి చేయడానికి అవసరమైన గడువు పొడిగింపు అంశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలించనుంది. అవసరమైన ఏర్పాట్లను వెంటనే తీసుకోవాలని మౌలిక వసతులు,పెట్టుబడుల శాఖ కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.