AP Employees Transfers : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు - మరో 15 రోజులు దాకా అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల కోసం మరో 15 రోజులు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సెప్టెంబర్ 15 వరకు బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, సెప్టెంబర్ 16 నుంచి మళ్లీ ఈ నిషేధం అమలులోకి వస్తుందని ఆర్థికశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. చాలా ప్రభుత్వ శాఖలు ఇప్పటికీ బదిలీల విధివిధానాలను పూర్తి చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రహదారులు, భవనాలు, రవాణా శాఖల్లో మార్గదర్శకాల స్పష్టత లేకపోవడం, విధివిధానాల రూపకల్పనలో కఠినతరం ఉన్నందున గడువు పొడిగించాల్సి వచ్చిందని తెలుస్తోంది.