LOADING...
Andhrapradesh: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వంట నూనెల భారీగా తగ్గింపు
గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వంట నూనెల భారీగా తగ్గింపు

Andhrapradesh: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వంట నూనెల భారీగా తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పండుగ సందర్భంగా సామాన్యులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్తను అందించింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ, తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో పామాయిల్ కిలోను రూ.110కి, సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలోను రూ.124కి అందించాలని నిర్ణయించారు. ఈ ధరలు నేటి నుంచి ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయి. అయితే, ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామాయిల్, ఒక లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే అందించనున్నారు.

వివరాలు 

పౌర సరఫరాల శాఖ మంత్రి  చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో సమావేశం 

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ధరల నియంత్రణపై చర్చ జరిగింది. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడం, పన్నులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడం వల్ల ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రమంతటా ఒక్కటే ధర ఉండాలని, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా ఒకే ధరతో నూనెలను విక్రయించాలని మంత్రి సూచించారు. ఈ నిర్ణయంపై డీలర్లు, సప్లయర్స్ సుముఖత వ్యక్తం చేశారు.