AP Govt: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని దేవాలయాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలను నివారించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి సంఘటనలు ఇక మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు, పర్యవేక్షణ కోసం ముగ్గురు మంత్రులతో ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది.
వివరాలు
దేవాలయాల నిర్వహణ, భద్రతపై చర్యలు
దేవాలయాల నిర్వహణ, భద్రతపై అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు పంపించింది. అలాగే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో దేవాలయాలపై జరిగిన దాడుల వివరాలు, వాటిపై తీసుకున్న చర్యలను కూడా ఈ ఉపసంఘం పరిశీలించాలని సూచించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.