Andhra Pradesh: ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. 14 మందికి కొత్త పోస్టింగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పరిపాలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న పి. శ్రీనివాసులను బదిలీ చేసి, మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా, ఇప్పటివరకు మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమించింది. ఇక పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్‌కుమార్‌ను నియమించగా, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పన కుమారిని బాధ్యతలు అప్పగించింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్‌ను నియమించగా, అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజను నియమించింది.
వివరాలు
కడప జేసీగా నిధి మీనా నియామకం
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్‌ను నియమించిన ప్రభుత్వం, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్. శోబికను నియమించింది. కడప జిల్లా జేసీగా నిధి మీనాను నియమించగా, విశాఖపట్నం జేసీగా గొబ్బిళ్ల విద్యాధరిని బాధ్యతలు అప్పగించింది. అలాగే అన్నమయ్య జిల్లా జేసీగా శివ్ నారాయణ్ శర్మను, పల్నాడు జేసీగా వి. సంజనా సింహను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కడప జేసీగా నియమితులైన నిధి మీనా, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సతీమణి కావడం గమనార్హం.