LOADING...
Andhra News: స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు.. సంస్కరణల అమలుకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
సంస్కరణల అమలుకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

Andhra News: స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు.. సంస్కరణల అమలుకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పంచాయతీ క్లస్టర్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, ప్రతి పంచాయతీని స్వతంత్ర పరిపాలనా యూనిట్‌గా ప్రకటించింది. ఈ సందర్భంలో అన్ని పంచాయతీలను నాలుగు వర్గాలుగా విభజించడమే కాక, ఇప్పటి వరకు ఉన్న పంచాయతీ కార్యదర్శుల హోదాను మార్చి, వారికి 'పంచాయతీ అభివృద్ధి అధికారులు (PDO)'గా మార్చింది. పురపాలక సంస్థల మాదిరిగా, ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యము, తాగునీటి పంపిణీ, గ్రామ ప్రణాళిక, వీధి దీపాల నిర్వహణ, ఇంజినీరింగ్‌, ఆదాయ, పన్నుల వసూళ్ల వంటి విభాగాలను ఏర్పరచి, వాటికి తగిన సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు 

కొత్త వ్యవస్థలో మార్పుల వివరణ 

ఈ ప్రతిపాదనలకు ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలపగా, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ దీనికి సంబంధించి మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు ఆదేశాలు పంపించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 7,244 క్లస్టర్‌ వ్యవస్థను రద్దు చేస్తూ, మొత్తం 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా గుర్తింపు. ఈ 13,351 పంచాయతీలను నాలుగు గ్రేడులుగా వర్గీకరింపు: రూర్బన్‌ పంచాయతీలు: 359 గ్రేడ్‌-1: 3,082 గ్రేడ్‌-2: 3,163 గ్రేడ్‌-3: 6,747 గ్రేడ్‌-1 పంచాయతీల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శుల పోస్టులను డిప్యూటీ ఎంపీడీవో స్థాయిలో చేర్చే నిర్ణయం. మిగిలిన పంచాయతీ కార్యదర్శులను మూడవేర్వేరు గ్రేడులుగా విభజన.

వివరాలు 

పంచాయతీల్లో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు

రూర్బన్‌ పంచాయతీల పరిపాలన మెరుగుపరచడానికి 359 మంది జూనియర్‌ అసిస్టెంట్‌లు, బిల్‌ కలెక్టర్లను సీనియర్‌ అసిస్టెంట్‌లుగా ప్రమోట్ చేసే నిర్ణయం. ప్రతి పంచాయతీలో కింది విభాగాల్లో ప్రత్యేక సిబ్బంది నియామకం: పారిశుద్ధ్యం,తాగునీటి సరఫరా,గ్రామ ప్రణాళిక,వీధి దీపాల నిర్వహణ,ఇంజినీరింగ్,ఆదాయ, పన్నుల వసూలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు,డిజిటల్‌ అసిస్టెంట్లను గ్రామ ప్రణాళికా కార్యకలాపాల్లో వినియోగించనున్నారు. డిజిటల్‌ అసిస్టెంట్ల ఆధారంగా పంచాయతీల్లో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు. పంచాయతీల్లో ఉన్న కార్యదర్శుల ఖాళీలను 2025-26 ప్యానల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయం.