Page Loader
Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్‌ల బదిలీ 
Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్‌ల బదిలీ

Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్‌ల బదిలీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2024
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు. అదనపు డీజీ (విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్) కుమార్ విశ్వజిత్ అదనపు డీజీ (రైల్వేస్)గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెల్ (సీఐ) విభాగంలో ఐజీగా ఉన్న డాక్టర్ కొల్లి రఘురామి రెడ్డిని విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీగా బదిలీ చేశారు. ఆయనకు డ్రగ్ కంట్రోలర్ డీజీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. వీరితో పాటు మరో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Details 

సీఐడీ ఐజీగా సర్వశ్రేస్ట్ త్రిపాఠి

ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌గా ఉన్న అతుల్‌సింగ్‌ను ఏపీఎస్పీ అదనపు డీజీగా బదిలీ చేశారు. సీఐడీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్‌ను ఆక్టోపస్ ఐజీగా, రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీపీ (ఎఫ్‌ఏసీ)గా నియమించారు. ఆక్టోపస్ ఐజీగా ఉన్న ఎస్వీ రాజశేఖరబాబుకు హోంగార్డు ఐజీ (ఎఫ్‌ఏసీ)గా ఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అడ్మిన్ ఐజీగా ఉన్న సర్వశ్రేస్ట్ త్రిపాఠి సీఐడీ ఐజీగా బదిలీ అయ్యారు. విశాఖపట్నం డీఐజీ ఎస్ హరికృష్ణ ఐజీపీ (పర్సనల్), ఊజీ టెక్నికల్ సర్వీసెస్ (ఎఫ్‌ఏసీ)గా నియమితులయ్యారు.

Details 

ఆక్టోపస్ డీఐజీగా  ఎస్ సెంథిల్ కుమార్ 

కేవీ మోహన్ రావు డీఐజీ (డీజీపీ కార్యాలయం)స్పోర్ట్స్ ఐజీగా బదిలీ అయ్యారు. కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ ఆక్టోపస్ డీఐజీగా, డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ (ఎఫ్ ఏసీ)గా బదిలీ అయ్యారు. ఏపీఎస్పీ (విజయనగరం)లోని 5వ బెటాలియన్ కమాండెంట్ రాహుల్ దేవ్ శర్మ డీఐజీ (శిక్షణ) డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. విశాల్ గున్ని డీసీపీ లా అండ్ ఆర్డర్ (విజయవాడ) నుంచి డీఐజీ (విశాఖపట్నం) రేంజ్‌కి బదిలీ అయ్యారు.

Details 

ఏ ఏ అధికారిని ఎక్కడెక్కడకు మార్చిందంటే.. 

రైల్వే పోలీస్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్‌ సింగ్‌ ఆక్టోపస్‌ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌ రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఐజీగానూ శ్రీకాంత్‌కు అదనపు బాధ్యతలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి డ్రగ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కొల్లి రఘురామిరెడ్డికి అదనపు బాధ్యతలు రాష్ట్రస్థాయి పోలీసు నియామకబోర్డు ఛైర్మన్‌గా రాజశేఖర్‌బాబు ఐజీ హోంగార్డ్స్‌గానూ రాజశేఖర్‌బాబుకు అదనపు బాధ్యతలు సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీగా హరికృష్ణకు అదనపు బాధ్యతలు స్పోర్ట్స్‌ ఐజీగా కె.వి.మోహన్‌రావు ఆక్టోపస్‌ డీఐజీగా సెంథిల్‌ కుమార్‌శాంతిభద్రతల డీఐజీగాను సెంథిల్‌కు అదనపు బాధ్యతలు

Details 

ఏ ఏ అధికారిని ఎక్కడెక్కడకు మార్చిందంటే.. 

పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్‌దేవ్‌ శర్మ విశాఖ రేంజ్‌ డీఐజీగా విశాల్‌ గున్ని కర్నూలు రేంజ్‌ డీఐజీగా సీహెచ్‌ విజయరావు విశాఖ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా ఫకీరప్ప కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్‌ నయీం ఆస్మి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీగా ఆరిఫ్‌ హఫీజ్‌ ప.గో. జిల్లా ఎస్పీగా హజిత వేజెండ్ల రాజమండ్రి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గా సుబ్బారెడ్డి కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా వై.రిశాంత్‌ రెడ్డి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగాను రిశాంత్‌రెడ్డిగా అదనపు బాధ్యతలు చిత్తూరు ఎస్పీగా జోషువా ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్‌ విశాఖ శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్‌ మణికంఠ ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌గా అధిరాజ్‌ సింగ్‌ రాణా

Details 

ఏ ఏ అధికారిని ఎక్కడెక్కడకు మార్చిందంటే.. 

కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా కృష్ణకాంత్‌ పటేల్‌ గుంటూరు ఎస్పీగా తుషార్‌ జగ్గయ్యపేట డీసీపీగా కె.శ్రీనివాసరావు రంపచోడవరం ఏఎస్పీగా కె.ధీరజ్ పాడేరు ఏఎస్పీగా ఎ.జగదీశ్‌ విజయవాడ డీసీపీగా ఆనంద్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.