LOADING...
Andhra Pradesh: ట్రావెల్స్ బస్సుల పన్ను తగ్గింపు.. ఏపీలో రీ-రిజిస్ట్రేషన్‌కు పిలుపు 
ట్రావెల్స్ బస్సుల పన్ను తగ్గింపు.. ఏపీలో రీ-రిజిస్ట్రేషన్‌కు పిలుపు

Andhra Pradesh: ట్రావెల్స్ బస్సుల పన్ను తగ్గింపు.. ఏపీలో రీ-రిజిస్ట్రేషన్‌కు పిలుపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ట్రావెల్స్ బస్సులపై పన్నును గణనీయంగా తగ్గించనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం త్రైమాసికానికి సీటుకు రూ.4 వేలుగా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులను ఏపీకి తీసుకువచ్చి రీ-రిజిస్ట్రేషన్ చేయాలని బస్సుల యజమానులను మంత్రి కోరారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణాశాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్‌తో పాటు సీనియర్ అధికారులు, అఖిల భారత పర్యాటక బస్సుల యజమానుల సంఘ ప్రతినిధులతో మంత్రి చర్చించారు.

వివరాలు 

బస్సుల్లో సరుకు రవాణాకు అనుమతి ఉండదు 

పన్ను తగ్గింపు నిర్ణయం అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందిన సుమారు 700 బస్సులను ఏపీకి తీసుకువచ్చి రీ-రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత యజమానులదేనని మంత్రి స్పష్టం చేశారు. బస్సుల్లో సరుకు రవాణాకు అనుమతి ఉండదని, ప్రయాణికుల లగేజీ మాత్రమే తీసుకెళ్లాలని మంత్రి తెలిపారు. దీనిపై బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు స్పందిస్తూ.. పన్ను తగ్గిస్తే అన్ని బస్సులను ఏపీకి తీసుకువచ్చి రీ-రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement