NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
    అర్జున్ దాస్ సస్పెండ్.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 08, 2023
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీలోని తిరుపతి హథీరాం జీ మఠానికి ప్రస్తుతం మహంతుగా ఉన్న అర్జున్ దాస్ పై వేటు పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

    మఠం ఆస్తుల్ని లీజులకిస్తూ అర్జున్ భారీగా అక్రమాస్తులను పోగేశారని గుర్తించినట్టు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు హథీరామ్ జీ మఠానికి బాధ్యులుగా ఓ కొత్తవ్యక్తిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

    అర్జున్ దాస్ కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారని చెప్పిన మంత్రి , ఏకంగా ప్రభుత్వానికే సదరు హథీరాంజీ మఠంపై ఏ హక్కులూ లేవంటూ అర్జున్ దాస్ న్యాయస్థానానికి వెళ్లరన్నారు.

    Details

    అర్జున్ దాస్‌ను సస్పెండ్ చేశాం, కొత్త వ్యక్తిని నియమిస్తాం : మంత్రి

    అలాగే సన్యాసిగా ఉండాల్సిన మహంత్ పెళ్లి చేసుకుని పిల్లల్ని సైతం కన్నారన్నారు. ఈ అంశంపై విచారణ కమిటీ వేసి నిజనిజాలు నిగ్గుతేల్చామన్నారు. ఫలితంగా చర్యలు కూడా తీసుకున్నామని మంత్రి అన్నారు.

    అందుకే ధార్మిక పరిషత్ ద్వారా స్వామీ హథీరాం జీ మఠం మహంత్‌గా ఉన్న అర్జున్ దాస్‌ను సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామన్నారు.

    చిత్తూరు జిల్లా తిరుపతిలోని హథీరాం మఠానికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలను అక్కడి రెవెన్యూ అధికారులు కూల్చివేసిన విషయం విదితమే.

    ఎప్పట్నుంచో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల, రాష్ట్రంలో తాజాగా చేసిన లక్ష్మిరాజశ్యామల యాగం పుణ్య ఫలమేనని మంత్రి అన్నారు. శ్రీశైల మల్లిఖార్జున సన్నిధిలో కుంభాభిషేకానికి సంకల్పించినా వేసవి నేపథ్యంలో వాయిదా వేశామని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    ఆంధ్రప్రదేశ్

    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు విద్యా శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు హైకోర్టు
     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  సీబీఐ

    ప్రభుత్వం

    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రకటన
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఫీచర్
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రకటన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025