LOADING...
Ap High Court:  టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ..
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ..

Ap High Court:  టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీటీడీ పరకామణి కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసును సీఐడీ తక్షణం, అత్యవసరంగా దర్యాప్తు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తమ కౌంటర్ సమర్పించిన విషయం తెలిసిందే. ఏవీఎస్‌వో సతీశ్ కుమార్, చోరీలో పాల్గొన్న రవికుమార్‌తో రాజీ చేసుకున్నారని తన పిటిషన్‌లో అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై కోర్టు నిర్ణయం వెలువరించింది. రవికుమార్ ఆస్తులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా, ఈ రాజీ ప్రక్రియలో టీటీడీ బోర్డు సభ్యులు మరియు సంబంధిత అధికారుల పాత్రను కూడా పరిశీలించాలని తెలిపింది.

వివరాలు 

తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా 

రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఆస్తులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోర్టు పేర్కొంది. ఆస్తుల బదిలీలు జరిగాయా లేదా అనే విషయాన్ని స్పష్టంగా తేల్చాలని సూచించింది. తదుపరి విచారణకు ముందు నివేదిక సమర్పించాలని సీఐడీ, ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు దర్యాప్తును సీఐడీ డిసెంబర్ 2 లోపు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించగా, తదుపరి విచారణ డిసెంబర్ 2న జరగనుంది.