Loading...
AP High Court: మెగా డీఎస్సీ వివాదం: సీబీఐ విచారణ కోరిన పిటిషన్‌కు హైకోర్టు నిరాకరణ
మెగా డీఎస్సీ వివాదం: సీబీఐ విచారణ కోరిన పిటిషన్‌కు హైకోర్టు నిరాకరణ

AP High Court: మెగా డీఎస్సీ వివాదం: సీబీఐ విచారణ కోరిన పిటిషన్‌కు హైకోర్టు నిరాకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా స్పోర్ట్స్ కోటా కారణంగా నష్టపోయామని చెప్పుకుంటున్న అభ్యర్థులు స్వయంగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. బాధితులే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

వివరాలు 

పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం

అభ్యర్థులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారని పిటిషనర్ తరఫున చేసిన వాదనలను న్యాయస్థానం సమర్థించలేదు.

ఆ వాదనలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలయ్యే ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతిస్తే, పిల్ వ్యవస్థ అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం వెలువరించింది.

ADVERTISEMENT