LOADING...
AP Inter Results 2026: నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల .. ఇలా చెక్‌ చేయండి..
నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల .. ఇలా చెక్‌ చేయండి..

AP Inter Results 2026: నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల .. ఇలా చెక్‌ చేయండి..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎంతోఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈరోజు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో సులభంగా చూసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైట్‌ resultsbie.ap.gov.in సందర్శించి, హాల్ టికెట్ సంఖ్యను నమోదు చేస్తే వెంటనే మార్కులు, గ్రేడ్‌లు తెలుసుకోవచ్చు.

వివరాలు 

మిత్ర సేవలో ఫలితాలు

అదనంగా, విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మిత్ర సేవలో భాగంగా 95523 00009 సంఖ్యకు"Hi"అని సందేశం పంపితే వెంటనే ఫలితాలు అందుతాయి. దీని వలన వెబ్సైటుపై అధిక భారం ఉన్నా కూడా విద్యార్థులు సులభంగా తమ ఫలితాలను పొందగలరు. ఈసందర్భంగా మంత్రి లోకేశ్ విద్యార్థులకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు రాసిన ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఫలితాల సమయంలో విద్యార్థులు ఆందోళనకు లోనుకాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈసంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మొదటి సంవత్సరం,రెండో సంవత్సరం పరీక్షలకు సుమారు 10.50లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్..

Advertisement