Loading...
Andhra Pradesh: ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌..  
ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌..

Andhra Pradesh: ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌..  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మురసు' తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్'లో పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ యథావిధిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అనిల్‌ చంద్రపునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో వర్షాల పరిస్థితి, పోలింగ్‌ నిర్వహణకు ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయని ఎక్కువ మంది కలెక్టర్లు ఎస్‌ఈసీకి వివరించారు. కొన్ని పరిమిత ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్‌ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

వివరాలు 

కొన్ని జిల్లాల్లోని మండలాలు మినహా..

అయితే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్ని చోట్ల ఎన్నికల సామగ్రిని తరలించేందుకు సమస్యలు ఎదురవుతున్నాయని కొందరు కలెక్టర్లు వెల్లడించారు.

ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తితే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, కలెక్టర్లు సమర్పించే నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.

కొన్ని జిల్లాల్లోని మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ యథావిధిగా నిర్వహించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ADVERTISEMENT