LOADING...
Andhra News: ఈ నెల నుంచి విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 
ఈ నెల నుంచి విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

Andhra News: ఈ నెల నుంచి విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్‌ వినియోగదారులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ నెల నుంచే బిల్లులను తగ్గించే చర్యలు ప్రారంభించామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఎఫ్‌పీపీపీ ఛార్జీల పేరుతో ప్రతి యూనిట్‌పై సుమారు 40 పైసలు అదనంగా వసూలు చేసి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భారాన్ని తగ్గిస్తూ నవంబర్‌ నెల నుండి ఈ ఛార్జీలను 13 పైసల వరకు తగ్గిస్తున్నందువల్ల వినియోగదారులకు కొంతమేర ఆర్థికంగా ఉపశమనం లభిస్తుందని వివరించారు.

వివరాలు 

రూ.250 కోట్ల వ్యయంతో మొత్తం 69 విద్యుత్‌ ఉపకేంద్రాల నిర్మాణం

అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలోని చౌడువాడ, కింతలిల్లో బుధవారం కొత్తగా నిర్మించిన విద్యుత్‌ ఉపకేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో రూ.250 కోట్ల వ్యయంతో మొత్తం 69 విద్యుత్‌ ఉపకేంద్రాల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. అదే విధంగా, రాష్ట్రంలో 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా సౌర విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రకటించారు. కాగా, విద్యుదాఘాతానికి గురై మరణించిన ఇద్దరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయంగా చెక్కులను అందజేశారు.

Advertisement