Loading...
Andhra Pradesh: ఏపీ పోర్టుల ద్వారా రూ.14,630 కోట్ల ఎగుమతులు.. మరో రూ.8 వేల కోట్ల లక్ష్యం
ఏపీ పోర్టుల ద్వారా రూ.14,630 కోట్ల ఎగుమతులు.. మరో రూ.8 వేల కోట్ల లక్ష్యం

Andhra Pradesh: ఏపీ పోర్టుల ద్వారా రూ.14,630 కోట్ల ఎగుమతులు.. మరో రూ.8 వేల కోట్ల లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.14,630 కోట్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఇందులో కంటెయినర్ల ద్వారా రూ.8,540 కోట్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు చేరగా.. నాన్‌ కంటెయినర్‌ విధానంలో మరో రూ.6,090 కోట్ల ఎగుమతులు జరిగాయి. గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని పోర్టుల ద్వారా జరిగే ఎగుమతుల్లో ఏటా సగటున 1.5 శాతం కాంపౌండ్‌ వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదవుతోంది. ఈ ఎగుమతుల విలువను మరింత పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నిర్మాణంలో ఉన్న పోర్టులన్నీ అందుబాటులోకి వస్తే అదనంగా రూ.8,095 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది.

వివరాలు 

దుగరాజపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం

ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, కాకినాడ, నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఏపీ మారిటైమ్‌ బోర్డు భావిస్తోంది.

వీటితోపాటు తిరుపతి జిల్లాలో ప్రతిపాదించిన దుగరాజపట్నం పోర్టు నిర్మాణ పనులను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రాష్ట్రానికి పొరుగున ఉన్న తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో ఇప్పటికే పోర్టులు ఉన్నప్పటికీ.. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఉత్పత్తులను అక్కడికి తరలించాలంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఏపీలోని పోర్టుల ద్వారా ఎగుమతి సేవలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

వివరాలు 

మహారాష్ట్రలోని పోర్టులపై ఆధారపడుతున్నమహారాష్ట్రలోని పోర్టులపై ఆధారపడుతున్నా

మరోవైపు తీర ప్రాంతం లేని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తమ ఎగుమతుల కోసం ప్రధానంగా మహారాష్ట్రలోని పోర్టులపై ఆధారపడుతున్నాయి.

ఈ రాష్ట్రాల నుంచి వచ్చే ఉత్పత్తులను కూడా ఏపీలోని ఓడరేవుల ద్వారా విదేశాలకు పంపించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

పొరుగు రాష్ట్రాల ఎగుమతులను ఏపీ పోర్టుల వైపు మళ్లించడం ద్వారా రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతుల విలువను మరింత పెంచుకోవచ్చని అంచనా వేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎగుమతులను ఏపీ పోర్టుల వైపు మళ్లించేలా చర్యలు

ప్రభుత్వ నిర్వహణలో ఉన్న గంగవరం, కాకినాడ డీప్‌ వాటర్‌, కృష్ణపట్నం పోర్టుల మొత్తం కార్గో నిర్వహణ సామర్థ్యం ఏడాదికి 195 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు.

అయితే ప్రస్తుతం ఈ సామర్థ్యంలో 66 శాతం మేర మాత్రమే కార్గో రవాణా జరుగుతోంది. 2030 నాటికి ఈ వినియోగాన్ని 75 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకోసం పోర్టులకు అనుసంధానంగా ఉన్న రవాణా, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

ముఖ్యంగా లాజిస్టిక్స్‌ ఖర్చులను కనీసం 30 శాతం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎగుమతులను ఏపీ పోర్టుల వైపు మళ్లించేలా చర్యలు

పోర్టుల్లో మౌలిక సదుపాయాలు, సరకు నిర్వహణ సౌకర్యాలను మెరుగుపరిస్తే పొరుగు రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఎగుమతులను ఏపీ ఓడరేవుల ద్వారా నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

తద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు కొత్త పోర్టుల ద్వారా అదనపు ఎగుమతులకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ADVERTISEMENT