Page Loader
Ap Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుపానుగా మారితే వానలే వానలు
Rains : బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం.. తుపానుగా మారితే వానలే వానలు

Ap Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుపానుగా మారితే వానలే వానలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 01, 2023
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఏర్పడే తుపాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల్లోనే తీరం దాటుతుంటాయి. అయితే వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు తుపాన్లు ఉత్తర దిశగా మళ్లాయి. తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం కారణంగా ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం రెండు తుపాన్లు దిశ మార్చుకోవడంతో ఏపీలో లోటు వర్షపాతం నెలకొంది.నైరుతి,ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించిన మేర వర్షాలు పడలేదు. మరోవైపు 'మిచౌంగ్‌' తుపాను దిశ మార్చుకుంటే వర్షాభావ పరిస్థితులు ఎదురవుతాయని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు భానుకుమార్‌ అన్నారు.

DETAILS

ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు 

బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం శుక్రవారానికి వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి తుపానుగా మారుతుందని వెల్లడించింది. తర్వాత వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా మధ్యలో తీరానికి చేరువ కానుంది. ఫలితంగా ఏపీలోని దక్షిణ కోస్తాలో ఆదివారం, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తుపాను తీరం దాటే విషయంలో శుక్రవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశముందని తెలిపింది. తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతోందని, అది తుపానుగా మారేందుకు సముద్రం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ 'స్కైమెట్‌' వెల్లడించింది.