AP Rains: బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం.. రాష్ట్రానికి మరో 4 రోజుల వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు. ఇది తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో కదులవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ కర్ణాటకపై కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశలో కదిలి, తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం వైపు ప్రయాణించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వివరాలు
ఈ జిల్లాల్లో వర్షాలు
కోస్తా ప్రాంతంలో గంటకు 30-40 నుండి 50 కిమీ వరకు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని పేర్కొన్నారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యభారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడుతాయని కేంద్రం తెలిపింది.