LOADING...
Montha Cyclone: మొంథా తుపాను బాధితులకు రూ.285.61 కోట్ల సాయం మంజూరు
మొంథా తుపాను బాధితులకు రూ.285.61 కోట్ల సాయం మంజూరు

Montha Cyclone: మొంథా తుపాను బాధితులకు రూ.285.61 కోట్ల సాయం మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.285.61 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబరులో ఏపీని ప్రభావితం చేసిన మొంథా తుపాను కారణంగా నష్టపోయిన వారికి వివిధ రూపాల్లో ఈ సాయం అందించనున్నట్లు తెలిపింది. సంబంధిత ప్రక్రియ పూర్తయిన వెంటనే బాధితులకు ఈ నిధులు అందేలా చర్యలు చేపట్టనున్నారు.

వివరాలు 

50,751 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం

అదే సమయంలో, 2023 డిసెంబరులో సంభవించిన తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతు కుటుంబాల్లో అప్పట్లో సాయం అందని 50,751 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం మరో రూ.48.11 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ ఆదేశాలను విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ జారీ చేశారు.

Advertisement