Loading...
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్ ఫలితాలు విడుదల.. 96.06 శాతం మంది ఉత్తీర్ణత
ఏపీ స్పెషల్ టెట్ ఫలితాలు విడుదల.. 96.06 శాతం మంది ఉత్తీర్ణత

AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్ ఫలితాలు విడుదల.. 96.06 శాతం మంది ఉత్తీర్ణత

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్ టెట్ (AP Special TET) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం రాత్రి అధికారులు ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షల్లో ఏకంగా 96.06 శాతం మంది ఉపాధ్యాయులు అర్హత సాధించారు. మొత్తం 68,420 మంది ఉపాధ్యాయులు 83,015 దరఖాస్తులు సమర్పించి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 79,743 మంది అభ్యర్థులు టెట్‌లో ఉత్తీర్ణత సాధించారు. వ్యక్తిగత లాగిన్ ద్వారా ఫలితాలు స్పెషల్ టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం టెట్ టు డీఎస్సీ (TET-to-DSC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, వ్యక్తిగత లాగిన్ వివరాలను నమోదు చేయాలి. ఈ విషయాన్ని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.ఏపీ స్పెషల్ టెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 1.

వివరాలు 

హైకోర్టులో పిల్‌తో నెలకొన్న ఉత్కంఠ

స్పెషల్ టెట్ నిర్వహణకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.

దీంతో పరీక్ష ఫలితాల విడుదల ఆలస్యమవుతుందేమోనని ఉపాధ్యాయుల్లో కొంత ఆందోళన నెలకొంది.

అయితే, ఫలితాలను నిలిపివేయాలని హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

దీంతో అధికారులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సోమవారం రాత్రి ఫలితాలను విడుదల చేశారు.

వివరాలు 

ఏపీ స్పెషల్ టెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ను సందర్శించాలి.

2. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫలితాల విభాగాన్ని ఎంచుకోవాలి.

3. అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత లాగిన్ వివరాలను నమోదు చేయాలి.

4. స్క్రీన్‌పై కనిపించే ఫలితాలను పరిశీలించాలి.

5. భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ADVERTISEMENT