AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల .. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అక్టోబర్ 3 నుండి 21వ తేదీ వరకు నిర్వహించిన ఈ టెట్ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, 3,68,661 మంది (86.28%) హాజరయ్యారు. ప్రాథమిక కీ,రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసిన తర్వాత, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న తుది కీని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా, తుది కీని విడుదల చేయడంలో జాప్యం జరిగిందట, దాంతో ఫలితాల విడుదల వాయిదా పడింది.
టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఈ నేపథ్యంలో, మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులకు సంబంధించిన ప్రకటనను ఈ నెల 6న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రకటన విడుదలైన రోజునుంచి నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరించబడుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫలితాలకోసం https://cse.ap.gov.in/ఈ లింక్ క్లిక్ చెయ్యండి