LOADING...
AP Weather: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వానలు!
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వానలు!

AP Weather: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వానలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం పలు ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలోని అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వివరాలు 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత

అలాగే అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగనుందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Advertisement