Loading...
AP ZPTC, MPTC Elections: ఏపీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌.. 2.81కోట్ల మంది ఓటర్లు
ఏపీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌.. 2.81కోట్ల మంది ఓటర్లు

AP ZPTC, MPTC Elections: ఏపీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌.. 2.81కోట్ల మంది ఓటర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల యంత్రాంగం.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఎన్నికల సిబ్బందికి అవసరమైన పోలింగ్‌ సామగ్రిని ఇప్పటికే అందజేసింది. మురసు తుపాను ప్రభావంతో వాతావరణ పరిస్థితులు, స్థానికంగా చోటుచేసుకునే పరిణామాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు గమనించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

వివరాలు 

అవసరమైన చోట అదనపు బలగాలు.. డీజీపీ

మున్సిపల్‌ ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన విధంగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు.

సెక్టార్‌ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల రద్దీని నియంత్రించడం, క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.

వివరాలు 

2.52 లక్షల మంది సిబ్బంది విధుల్లో..

రాష్ట్రవ్యాప్తంగా 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున తెలిపారు.

ఇందుకోసం 31,460 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాల పరిస్థితులపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

ఓటు రహస్యానికి ఎలాంటి భంగం కలగకుండా పోలింగ్‌ కేంద్రాల వెలుపలే కాకుండా.. అవసరమైన చోట్ల లోపల కూడా పరిస్థితులను వీడియో రికార్డింగ్‌ చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

ఎన్నికల విధుల్లో సుమారు 2.52 లక్షల మంది సిబ్బంది పాల్గొంటుండగా.. ఓట్ల లెక్కింపు కోసం దాదాపు 52 వేల మంది సిబ్బందిని వినియోగించనున్నట్లు వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

2.52 లక్షల మంది సిబ్బంది విధుల్లో..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 2,051 స్థానాలు ఏకగ్రీవమైనట్లు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కృష్ణతేజ తెలిపారు.

అలాగే మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,770 ఎంపీటీసీ, 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ADVERTISEMENT