Kerala: 2005లో దరఖాస్తు.. 2026లో అపాయింట్‌మెంట్ లెటర్.. 61 ఏళ్ల కేరళ వ్యక్తికి ఊహించని షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగ నియామక లేఖ రెండు దశాబ్దాల తర్వాత అందడం చర్చనీయాంశంగా మారింది. మల్లాపురం జిల్లాలోని కలికావుకు చెందిన 61 ఏళ్ల అబ్దుల్ మజీద్‌కు ఇటీవల కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) నుంచి పార్ట్‌టైమ్ జూనియర్ అరబిక్ టీచర్ పోస్టుకు సంబంధించిన అడ్వైస్ మెమో వచ్చింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన ఈ ఉద్యోగానికి 2005లో దరఖాస్తు చేసుకోగా, అపాయింట్‌మెంట్ లెటర్ మాత్రం 2026లో చేరింది. వివరాల ప్రకారం,మజీద్ 2005లో నిర్వహించిన పీఎస్సీ పరీక్ష రాశారు. ఆయన పేరు ఉన్న అధికారిక ర్యాంక్ లిస్ట్ 2008లోనే గడువు ముగిసింది. ర్యాంక్ లిస్ట్‌లో స్థానం సంపాదించడంతో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశతో ఆయన ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశారు.
వివరాలు
ఇప్పుడు ఆ ఉద్యోగంలో చేరే అవకాశం లేదు: మజీద్
కానీ సంబంధిత శాఖ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో క్రమంగా ఆశలు వదిలేసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన మజీద్, ప్రభుత్వ ఉద్యోగం తన జీవిత లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. అయితే 18 ఏళ్ల పాటు ఖాళీ భర్తీ కాకపోవడం వల్ల తన ఉద్యోగావకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన వయస్సు 60 ఏళ్లు దాటిపోయిందని, ఇప్పుడు ఆ ఉద్యోగంలో చేరే అవకాశం లేదని పేర్కొన్నారు. అధికారుల సమాచారం ప్రకారం, పలుమార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా, సరైన అభ్యర్థులు లభించకపోవడంతో ఆ ఖాళీ చాలా కాలం భర్తీ కాలేదు. చివరకు అదే ఖాళీకి సంబంధించి మజీద్ పేరును సిఫారసు చేస్తూ అడ్వైస్ మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
సరదాగా స్పందిస్తున్న నెటిజన్లు
ఇదిలా ఉండగా, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. "తాను దరఖాస్తు చేసిన విషయమే మర్చిపోయి ఉండొచ్చు.. ఇరవై ఏళ్ల తర్వాత ఎంపికయ్యారంటూ లేఖ రావడం ఆశ్చర్యమే" అని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. మరో వ్యక్తి "ఆశ వదలొద్దు.. అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చేలోపు మీ పిల్లలు కూడా అదే ఉద్యోగానికి అర్హులు అయ్యే అవకాశం ఉంది" అంటూ చమత్కరించాడు. ఇంకొకరు "భారత ప్రభుత్వ వ్యవస్థ వేగానికి సాటిలేదు.. యవ్వనంలో దరఖాస్తు చేసి, రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగం వచ్చింది" అని సెటైర్ వేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
20 ఏళ్ల తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్
🚨 A Kerala man applied for a government job in 2005 and has received an appointment letter as a part-time junior Arabic teacher in 2026. 20 years later. 🙏 pic.twitter.com/fgaDLCuS8r
— Indian Tech & Infra (@IndianTechGuide) May 31, 2026