Loading...
Telangana: 2026-27లో గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్ల మంజూరు
2026-27లో గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్ల మంజూరు

Telangana: 2026-27లో గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్ల మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2026
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

గృహజ్యోతి పథక అమలుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,080 కోట్ల విడుదలకు రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50.20 లక్షల గృహాలకు ఈ పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సేవలను అందిస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రతి నెలా రూ.186 కోట్ల చొప్పున చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

పథకం ప్రారంభమైన తొలి ఏడాది రూ.1,612 కోట్లు విడుదల

ఇదే తరహాలో గత సంవత్సరం కూడా రూ.2,080 కోట్లు విడుదలకు 2025 ఏప్రిల్‌ 15న ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, తరువాత 2025 మే 26న సవరించిన ఉత్తర్వుల్లో మొత్తం మొత్తాన్ని రూ.1,900 కోట్లకే పరిమితం చేసింది.

ఈ పథకం ప్రారంభమైన తొలి ఏడాది అయిన 2024-25లో ప్రభుత్వం రూ.1,612 కోట్లు విడుదల చేసింది.

ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా ఈ పథకంలో చేర్చి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నాయి.

అయితే వారిని కూడా కలిపితే నెలవారీ విద్యుత్ బిల్లుల భారం మరింత పెరిగే అవకాశముందని విద్యుత్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT