APPSC: ఏపీలో 163 గ్రూప్-1 పోస్టులు.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 163 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభమై.. 27వ తేదీ వరకు కొనసాగనుంది. 163 పోస్టులకు భర్తీ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 163 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
ఏ పోస్టులు ఎన్నంటే?
డిప్యూటీ కలెక్టర్లు: 11
ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు: 14
డీఎస్పీ (సివిల్): 36
డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 3
డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (DEO): 14
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 1 ఆర్టీవోలు (RTO): 3
డిప్యూటీ రిజిస్టర్ (కోఆపరేటివ్ సర్వీసెస్): 15
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2: 12
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్: 2
డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్: 3
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14
డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 35
దరఖాస్తుల తేదీలు:
గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించాలి.
అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను APPSC అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.