Page Loader
Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం 
జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం

Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో వాహనాల తనిఖీల సందర్భంగా సైనికులు తనపై దాడి చేశారంటూ ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై భారత సైన్యం స్పందించి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. గురువారం రాత్రి రాజౌరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న లియాఖత్ అలీ, వివాహ కార్యక్రమానికి హాజరై ఇతరులతో కలసి కలకోట్‌కు తిరిగి వెళ్తుండగా, ఆర్మీ సిబ్బంది తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్‌'ద్వారా పంచుకున్నారు.

వివరాలు 

తలపై ఆరు కుట్లు 

నా కుటుంబంలో చాలామంది భారత సైన్యంలో పనిచేశారు.ఈ విషయమై నేను ఎప్పుడూ గర్వించేవాడిని. కానీ ఈ రోజు జరిగిన ఘటన ఆ గౌరవాన్నితగ్గించింది .వాహన తనిఖీల సమయంలో నా గుర్తింపు కార్డును చూపించమని వారు కోరారు. దాన్ని చూపించేందుకు కారు దిగుతున్న నాపై ఆకస్మికంగా వారే దాడి చేశారు. ఆయుధాలతో తలపై బలంగా కొట్టారు. ఈ ఘటనలో నాకు తీవ్ర గాయాలయ్యాయి. వారు క్షమాపణ కూడా చెప్పలేదు. భారత సైన్యం దేశ గర్వకారణం. నాకు న్యాయం జరగాలి"అని అలీ రాసుకొచ్చారు.

వివరాలు 

ఇప్పటికే కేసు నమోదు చేసిన భారత సైన్యం

ఈ నేపథ్యంలో భారత సైన్యం స్పందించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై సమాచారం అందడంతో అక్కడ వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

వివరాలు 

తీవ్రంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి

ఇక ఈ ఘటనపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు.